జగన్‌ ఫేక్ ముఖ్యమంత్రి : చంద్రబాబు

by srinivas |   ( Updated:2020-12-17 05:59:13.0  )
జగన్‌ ఫేక్ ముఖ్యమంత్రి : చంద్రబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులు చేపట్టిన ఉద్యమం ఏడాది పూర్తైన సందర్భంగా అమరావతి జేఏసీ గురువారం ‘జనరణభేరి’ బహిరంగా సభ నిర్వహించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… సీఎం జగన్‌రెడ్డి ఒక ఫేక్ ముఖ్యమంత్రి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఇప్పటికైనా జగన్ చేసిన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు.. అధికారంలోకి వచ్చిన 18నెలల్లో ఏం చేశారని ప్రశ్నించారు.

అంతేగాకుండా వైఎస్ జగన్ వన్ టైమ్ సీఎం అని ఎద్దేవా చేశారు. జగన్‌కు దమ్ముంటే అమరావతిపై రెఫరండం పెట్టాలని డిమాండ్ చేశారు. రెఫరెండంలో అమరావతి ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో రాజధాని అమరావతికి మద్దతుగా మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల పేరుతో నాటకాలాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అమరావతి సభకు వెళ్లడానికి ముందు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు.. రాజధానిని రక్షించాలని మొక్కుకున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story