- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరెంటు బిల్లులు కట్టని చంద్రబాబు, జానారెడ్డి
సామాన్య ప్రజలు ఒక నెల కరెంటు బిల్లు చెల్లించకపోతే విద్యుత్ కనెక్సన్ కట్ చేసే అధికారులు.. బడా సంస్థలు, నేతల విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కరెంట్ డిపార్ట్‌మెంట్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన బకాయిదారుల జాబితాలో మైహోం కన్‌స్ట్రక్షన్, ఏలియన్ డెవలపర్స్‌తో పాటు పొలిటికల్ లీడర్లు చంద్రబాబు, కె.జానారెడ్డి పేర్లు ఉన్నాయి. మరీ వీరి నుంచి పెండింగ్ బిల్లులను ఎందుకు వసూలు చేయలేకపోతున్నారనే విషయాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: కరెంట్ బిల్లుల వసూళ్లలో కరెంట్ డిపార్ట్‌మెంట్ వివక్ష చూపుతోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఒక నెల బిల్లును చెల్లించడంలో ఆలస్యం చేస్తే వెంటనే కనెక్షన్‌ను తొలగిస్తారు అధికారులు. కానీ, బడా సంస్థలు, నేతలకు సంబంధించి రూ.వేలు, లక్షల్లో బిల్లులు పెండింగ్ ఉన్నా అధికారులు మౌనం వహిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, యూసుఫ్ గూడ, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లోని ఉన్న బడా సంస్థలు విద్యుత్ బిల్లులు పెండింగ్‌లో అధికారులు వాటిని ఎందుకు వసూలు చేయడం లేదనే కారణాలు వారికే తెలియాలి. బడా సంస్థలతో పాటు ప్రభుత్వరంగ సంస్థలు, పోలీసు కమిషనర్లు, పాఠశాల హెడ్‌మాస్టర్లు సైతం కరెంటు బిల్లు బకాయిదారుల జాబితాలో ఉన్నారు.
పర్యవేక్షణ కరువు..
కరెంటు వినియోగించుకుంటూ బిల్లులను చెల్లించకపోవడంతో.. విద్యుత్ సరఫరా చేసే సంస్థలకు విద్యుత్ సంస్థ రూ.5012 కోట్లకు పైగా బకాయిపడినట్టు సమాచారం. ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంపన్న వర్గాల వారి నుంచి కరెంటు బిల్లులను వసూలు చేయకపోవడం వెనుక పెద్దఎత్తున అవినీతి ఉన్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం అంతా ఆన్‌లైన్ అమలులోకొచ్చాక ఎవరు బిల్లు చెల్లించారు..? ఎవరు బకాయి పడుతున్నారనే విషయాలు అధికారులకు వెంటనే తెలిసిపోతుంది. అయినా, బకాయిదారుల నుంచి పెండింగ్ బిల్లులు వసూళ్లు చేయలేకపోతున్నారంటే.. కరెంటు విభాగం పనితీరు ఎంత బాధ్యతా రాహిత్యంగా ఉన్నదనే విషయం స్పష్టమవుతోంది.
బకాయిదారుల జాబితాలో ఉన్న పేర్లు
అప్‌డేట్ చేస్తున్నారా?
కరెంటు బిల్లులు బకాయిపడిన వారి లిస్టును ప్రతి మూడు నెలలకోసారి అప్ డేట్ చేయాలని అధికారులను ఈఆర్‌సీ ఆదేశించింది. కానీ, విద్యుత్ అధికారులు మాత్రం 2018 నుంచి ఇప్పటి వరకు వాటిని అప్ డేట్ చేస్తున్నట్టు కనిపించడం లేదు. ప్రస్తుతం వెబ్‌సైట్‌లో ఉన్న వివరాలను వివరాలను పరిశీలిస్తే ఇలా బడా సంస్థలు, నేతల పేర్లు బకాయిదారుల జాబితాలో ఉన్నాయి.