నిర్మాత చేతిలో మోసపోయిన ‘కలర్ ఫోటో’ హీరోయిన్

by Shyam |
నిర్మాత చేతిలో మోసపోయిన ‘కలర్ ఫోటో’ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కలర్ ఫోటో’ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించిన హీరోయిన్ చాందిని. సినిమాల్లో స్టార్ రేంజ్ సొంతం చేసుకోవాలనే డ్రీమ్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి.. ముందుగా షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఆ సమయంలో ఓ నిర్మాతతో తనను సినిమా రంగానికి పరిచయం చేసే అగ్రిమెంట్ జరిగిందని తెలిపింది. ఈ కాంట్రాక్టే తన కెరియర్‌కు మైనస్ అయిందని.. తొలి సినిమా ఆ బ్యానర్‌లోనే చేయాలనే అగ్రిమెంట్‌తో చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పింది. షార్ట్ ఫిల్మ్స్‌తో వచ్చిన ఫేమ్‌తో ఇండస్ట్రీ నుంచి మంచి అవకాశాలు వచ్చినా, వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది. ఆ నిర్మాత సినిమా చేస్తారని మూడేళ్లు వెయిట్ చేశానని.. అయినా కూడా మూవీ సెట్స్ మీదకు వెళ్లలేదని తెలిపింది. దీంతో చాలా గొడవలు అయ్యాయని చెప్పింది. మొత్తానికి ఆ పరిస్థితి నుంచి బయటపడి ఇతర సినిమాలు చేయగలిగానన్న చాందిని.. ఆ నిర్మాత వల్ల బెస్ట్ ఆపర్చునిటీస్ మిస్ అయ్యాయని వాపోయింది. ప్రయత్నిస్తేనే అవకాశాలు వస్తాయి.. కానీ వచ్చిన అవకాశాలు ఆ నిర్మాత వల్ల మిస్ అయ్యాయనని వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed