- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈటెల రాజేందర్‌కు మద్దతుగా 'చలో హైదరాబాద్'
దిశ, కల్వకుర్తి: మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు మద్దతుగా సోమవారం వెల్దండ మండలం నుండి పెద్ద సంఖ్యలో వాహనాల్లో చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సింగిల్ విండో డైరెక్టర్, బడుగు బలహీన వర్గాల నాయకులు మట్ట వెంకటయ్య అన్నారు. ఈటల రాజేందర్‌పై కుట్ర పన్ని కేబినెట్ నుండి బర్తరఫ్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఈటల రాజేందర్‌పై కుట్ర జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న సీలింగ్ భూములపై సీఎం వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు ఈటలపై పెరుగుతున్న ప్రజాబలాన్ని చూసి భయపడిన కేసీఆర్ ఎలాగైనా ఈటలను మంత్రివర్గం నుంచి తప్పించాలనే ప్లాన్ ప్రకారమే అవినీతి ఆరోపణలకు తెర లేపారని వెంకటయ్య గౌడ్ విమర్శించారు.
ఈటల రాజేందర్‌పై ఆరోపణలు వచ్చాయని. ఆయనతో చర్చించకుండానే క్యాబినెట్ నుండి తొలగించిన కెసీఆర్.. కొందరు రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చినా ఎందుకు స్పందించలేదన్నారు. ఈటలపై వచ్చిన ఆరోపణలకు మాత్రం అత్యుత్సాహం చూపించారని దుయ్యబట్టారు. సోమవారం హైదరాబాద్‌లో ఈటెల రాజేందర్‌ను కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని వెంకటయ్య గౌడ్ పేర్కొన్నారు.