కలెక్టర్ సంచలన ఉత్తర్వులు.. ఆ గ్రామ ప్రజాప్రతినిధులపై వేటు

by Shyam |
కలెక్టర్ సంచలన ఉత్తర్వులు.. ఆ గ్రామ ప్రజాప్రతినిధులపై వేటు
X

దిశ, భువనగిరి రూరల్: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, కార్యదర్శిని.. జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అధికారుల అనుమతి లేకుండా నగదును విత్ డ్రా చేసి, దుర్వినియోగం చేసిన నేపథ్యంలో సస్పెండ్ చేస్తునట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అనుమతి లేకుండా చల్లూరు గ్రామ పంచాయతీకి సంబంధించిన రూ.6,42,950 నగదును విత్ డ్రా చేయడమే కాకుండా.. దుర్వినియోగం చేశారని విచారణలో తేలడంతో గ్రామ సర్పంచ్ వంచ వీరారెడ్డి, ఉప సర్పంచ్ బింగి శ్రీనివాసులను.. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని 37(5 ) సెక్షన్ ప్రకారం 6 నెలల పాటు సస్పెండ్ విధించగా, 51(9) సెక్షన్ ప్రకారం జూనియర్ పంచాయతీ కార్యదర్శి కుమారి, ఐ. దేవమణిని సస్పెండ్ చేస్తునట్టు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఈ సస్పెన్షన్ కాలంలో ప్రధాన కార్యాలయాన్ని దాటి వెళ్లరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed