- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలి : సొసైటీ చైర్మన్
దిశ, బూర్గంపాడు : కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని బూర్గంపాడు సహకార పరపతి సంఘం అధ్యక్షులు బిక్కసాని శ్రీనివాసరావు అన్నారు. గురువారం బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లిబంజర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆందోళన ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. కాగా ప్రభుత్వ నిబంధనల మేరకు ధాన్యం నాణ్యత వచ్చాకే మిల్లులకు తరలించాలని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఎంత మంది రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేశారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం నుంచి మోరంపల్లి బంజర్ హమాలీలను పెంచి ధాన్యం కొనుగోలు వేగవంతం చేస్తామన్నారు. రైతులు ఎవరు అధైర్య పడవద్దని చెప్పారు. అనంతరం రికార్డులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది,రైతులు తదితరులు పాల్గొన్నారు.