నిత్యావసర సరుకుల పంపిణీ : జెడ్పీ చైర్‌ పర్సన్ అనిత

by Sridhar Babu |
నిత్యావసర సరుకుల పంపిణీ : జెడ్పీ చైర్‌ పర్సన్ అనిత
X

దిశ, రంగారెడ్డి : రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఉపాధి లేక, తినడానికి తిండిలేక పేదలు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్వరం మండలం కెసీ తండా, నాగుల్ దాన్ తండా, మహేశ్వరం గ్రామపంచాయతీల్లో వంగ సుధీర్ రెడ్డి ఆర్థిక సాయంతో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తీగల అనితా హరినాథ్ రెడ్డి శనివారం పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. కేసీ తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మోతిలాల్ నాయక్ అధ్యక్షతన ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన అనిత మాట్లాడుతూ..లాక్ డౌన్ కొనసాగుతుండటం వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అది గుర్తించిన సుధీర్ రెడ్డి నిత్యావసరాలు పంపిణీకి ముందుకు రావడం మంచి పరిణామమన్నారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుని మహేశ్వరం మండలంలో అనేక మంది వ్యాపారస్తులు, ప్రజా ప్రతినిధులు ముందుకు రావాలని అనితా రెడ్డి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులతో పాటు ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు, పంచాయతీ సభ్యులు, ఎంపీటీసీలు, అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకులు మండల పరిషత్ అధ్యక్షుడు కే రఘుమారెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు ఆర్ సునీత నాయక్, పీఎసీఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు హెచ్ చంద్రయ్య, కే చంద్రయ్య, కే యాదయ్య, దేశ నాయక్, సిద్దేశ్వర గౌడ్, ఎం. రాజు నాయక్, జె బద్రు నాయక్, గ్రామ పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.

Tags: carona,nessecities supply, poor people, zp chair person anitha, rangareddy

Advertisement

Next Story

Most Viewed