స్కూల్ టీచర్ మెడల్లోంచి పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు

by Sumithra |   ( Updated:2021-10-27 01:15:26.0  )
Chain-Snaching
X

దిశ, సదాశివనగర్: దుండగులు బైక్ పై వచ్చి స్కూల్ టీచర్ మెడల్లోంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన ఘటన సదాశివనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామంలోని కేజీబీవీ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కామారెడ్డి ఇస్లాంపూర్ కు చెందిన చెరుకూరి యమున అనే మహిళ మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును గుర్తుతెలియని దుండగులు బైక్ పై వచ్చి లాక్కెళ్లారు. పుస్తెలతాడును లాకెళ్లే సమయంలో యమునపై దుండగులు దాడి చేశారు. తీవ్ర గాయాలతో బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story