నాగారం మండలంలో చైన్ స్నాచింగ్

by  |   ( Updated:2020-10-21 09:13:50.0  )
నాగారం మండలంలో చైన్ స్నాచింగ్
X

దిశ, తుంగతుర్తి: పశువులు మేపుకొని తిరిగి ఇంటికి వెళ్తున్న మహిళ మెడలోంచి దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. నాగారం మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన ఎల్లంల మంగమ్మ ఎస్సారెస్పీ కాలువ వెంట పశువులను మేపి.. తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో బైక్‌పై వచ్చిన దుండగులు గోల్డ్‌ చైన్‌ను లాక్కెళ్లారు. గొలుసు చోరీపై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా… దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story