షాకింగ్ : చాడ వెంకట్ రెడ్డి కారుకు యాక్సిడెంట్

by Anukaran |
షాకింగ్ : చాడ వెంకట్ రెడ్డి కారుకు యాక్సిడెంట్
X

దిశ ప్రతినిధి, వరంగల్ : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. హన్మకొండలో ప్రయాణిస్తున్న ఆయన వాహనాన్ని మరో వాహనం ఢీ కొట్టింది. ఆ వాహనాలల్లో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. చాడ వెంకట్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story