- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వాలు ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేదు: చాడ వెంకట రెడ్డి
దిశ ప్రతినిధి, వరంగల్: ఎన్నికల వాగ్దానాలను నెరవేర్చలేని దుస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట రెడ్డి అన్నారు. విద్య, ఉద్యోగ రంగాల్లో ఖాళీలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాలక వర్గాల తీరుపై విద్యార్థి, యువత, నిరుద్యోగులు పోరాటాలు చేయాల్సిన సమయం అసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. గురువారం వరంగల్ ములుగు రోడ్‌లోని యంసీసీ కాన్ఫరెన్స్ హల్‌లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐయస్ఎఫ్), అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో విద్యార్థి, నిరుద్యోగ సదస్సు జరిగింది. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ల్యాదల్ల శరత్, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు ఐత యాకయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా చాడ వెంకట రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జాతీయ మాజీ అధ్యక్షులు తక్కళ్ళపల్లి శ్రీనివాస్ రావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు యన్ అశోక్ స్టాలిన్, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ, మారుపాక అనిల్ కుమార్ పాల్గొన్నారు.