దుకాణాలు తీయొచ్చు.. షరతులు వర్తిస్తాయి

by Shamantha N |
దుకాణాలు తీయొచ్చు.. షరతులు వర్తిస్తాయి
X

న్యూఢిల్లీ: లాక్ డౌన్ సమయంలో నిత్యావసరాలు కొనేందుకు ప్రజలు.. అమ్ముకునేందుకు వ్యాపారస్థులు తీవ్ర ఇక్కట్లు పడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కాస్తంత ఊరట కలిగించే విషయం చెప్పింది. నివాస ప్రాంతాల్లో ఉన్న దుకాణాలు, ఇండిపెండెంట్ హెయిర్ కటింగ్ షాపులు, టైలర్ షాపులు ఓపెన్ చేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ మేరకు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ లో రిజిస్టర్ అయిన అన్ని షాపులూ తెరుచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర హోంశాఖ శుక్రవారం అర్ధరాత్రి ఆదేశాలు జారీ చేసింది. అయితే, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, కంటైన్మెంట్ జోన్లు, కరోనా హాట్ స్పాట్ జోన్లలోని మల్టీ బ్రాండ్ మాల్స్ లో ఉన్న షాపులకు మాత్రం ఈ అనుమతులు వర్తించవని స్పష్టం చేసింది. అలాగే, తెరిచిన షాపుల్లో 50 శాతం సిబ్బందిని మాత్రమే తీసుకోవాలని, వారు కూడా మాస్కులు, హ్యండ్ గ్లోవ్స్ కచ్చితంగా ధరించి, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.కాగా, లాక్ డౌన్ నుంచి కేంద్రం ఇచ్చిన ఈ మినహాయింపుల అమలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంటుంది.

Tags: Centre Allows, Shops To Open, groceries, hair cutting shops, tailor shops, lockdown

Advertisement

Next Story

Most Viewed