వెరీగుడ్.. కరోనాను భలే కట్టడి చేశారు

by srinivas |
వెరీగుడ్.. కరోనాను భలే కట్టడి చేశారు
X

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కరోనా కట్టడి చర్యలపై సమీక్షిస్తున్న ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం పర్యటించింది. ఏపీలో కరోనాకి రాజధానిగా నిలిచిన కర్నూలు జిల్లాలో పాజిటివ్ కేసులు లెక్కకు మిక్కిలిగా నమోదవుతున్నప్పటికీ… శ్రీశైలంలో ఎలాంటి కేసులు లేకపోవడం పట్ల కేంద్ర బృందం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా శ్రీశైలంలో తీసుకుంటున్న కరోనా నియంత్రణ చర్యలను ఈవో రామారావు కేంద్ర బృందానికి వివరించారు. ఈవో వివరణతో ఇద్దరు సభ్యుల బృందం సంతృప్తి చెందింది. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, కరోనా వైరస్ దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం పరిమిత సంఖ్యలో దర్శనాలకు అనుమతించాలని చెప్పారు. కాగా, గత ఐదు రోజులుగా కేంద్ర బృందం ఏపీలో పర్యటిస్తూ కరోనా నియంత్రణ చర్యలను పరిశీలిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed