- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రాల పన్నుల వాటాలో కోత!
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం రాష్ట్రాలకు రూ. 46,038 కోట్ల నిధులను మంజూరు చేసింది. కొవిడ్-19 మహమ్మారితో పోరాటంలో భాగంగా ఏప్రిల్‌లో చెల్లించాల్సిన సెంట్రల్ ట్యాక్స్, డ్యూటీస్‌లలో రాష్ట్రాల వాటాను ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆయా రాష్ట్రాలకు పంపించింది. దీనికిముందు రాష్ట్రాలకు డిజాస్టర్ రెస్పాన్స్ మిటిగేషన్ ఫండ్(ఎస్‌డీఆర్ఎమ్ఎఫ్) కింద రూ. 17,287 కోట్లను విడుదల చేసింది. ఇటీవల లాక్‌డౌన్ వల్ల కేంద్రానికి, రాష్ట్రాలకు రాబడి పూర్తీగా తగ్గిన విషయం తెలిసిందే. రాబడి లేకపోవడంతో రాష్ట్రాలకు ఇచ్చే పన్ను వాటాల్లో ఆర్థిక శాఖ 29.5 శాతాన్ని తగ్గించింది. 15వ ఆర్థిక సంఘం నివేదిక ఆధారంగా రాష్ట్రాలకు ఇచ్చే కేంద్ర పన్నుల వాటా మొత్తం వస్తుందని రాష్ట్రాలు భావించాయి. కానీ, కేంద్రం అందులో కోత విధించింది.
లాక్‌డౌన్ కారణంగా రాష్ట్రాలకు పన్నులు, పన్నేతర రాబడులు భారీగా క్షీణించాయి. ఈ క్రమంలో కేంద్రం నుంచి నిధులొస్తాయని రాష్ట్రాలు ఆశపడ్డాయి. రావాల్సిన దాంట్లోనే కోత విధించడం గమనార్హం. కేంద్ర ఆర్థిక శాఖ మొత్తం రూ. 46,036 కోట్లను విడుదల చేయగా, మొత్తం అన్ని రాష్ట్రాలకు కలిపి రూ. 19,312 కోట్ల కోతను విధించింది. అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌కు రూ. 8,255 కోట్లు ఇవ్వగా, బీహార్‌కు రూ. 4,632 కోట్లు, మధ్య ప్రదేశ్‌కు రూ. 3,630 కోట్లు, మహారాష్ట్రకు రూ. 2,824 కోట్ల నిధులను అందించింది.
తెలుగు రాష్ట్రాలకూ మొండిచేయి..
ఏప్రిల్ నెలలో వాస్తవానికి తెలంగాణకు కేంద్ర పన్నుల వాటా కింద రూ. 1,195 కోట్లు రావాలి. కానీ, కేవలం రూ. 982 కోట్ల నిధులను మాత్రమే విడుదల చేసింది. రూ. 212 కోట్లను తగ్గించింది. అలాగే, ఏపీకి రూ. 2,686 కోట్లు రావాల్సి ఉండగా, అందులో రూ. 1,892 కోట్లను మాత్రమే ఇచ్చింది. రూ. 794 కోట్లకు కోత పడింది.
Tags: Coronavirus,Economy, Finance Ministry, 15th finance commission, share in central taxes and duties