66 కోట్ల వ్యాక్సిన్ డోసులకు కేంద్రం ఆర్డర్..

by Shamantha N |   ( Updated:2021-07-17 07:04:24.0  )
corona vaccine
X

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగం పుంజుకుంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత నెలకొంది. వ్యాక్సిన్ కొరతను అధిగమించి వ్యాక్సినేషన్ వేగాన్ని మరింత పెంచాలనే యోచనలో కేంద్రప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తాజాగా 66 కోట్ల వ్యాక్సిన్ డోసులకు కేంద్రం ఆర్డర్ చేసింది. వీటిలో 37.5 కోట్ల కొవిషీల్డ్ 28.5 కోట్ల కొవాగ్జిన్ డోసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ డోసులు ఆగస్టు- డిసెంబర్ మధ్య సరఫరా అవుతాయని అధికారులు చెబుతున్నారు.

కాగా, గతంలో కేంద్రం రూ.150లకు ఒక డోసు చొప్పున కొనుగోలు చేసేది. కానీ కొవిడ్-19 వ్యాక్సిన్ సేకరణ నూతన పాలసీ అమలులోకి వచ్చినప్పటి నుంచి వ్యాక్సిన్ ధరలు రివైజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. కొత్త పాలసీ ప్రకారం దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్ డోసుల్లో 75శాతాన్ని కేంద్రం సేకరిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed