- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CAA నిబంధనలు రెడీ అవుతున్నాయ్ : కేంద్రమంత్రి
దిశ, వెబ్‌డెస్క్ : సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ (CAA) చట్టానికి నిబంధనలు తయారవుతున్నాయని కేంద్రమంత్రి నిత్యానంద రాయ్ అన్నారు. మంగళవారం అందుకు సంబంధించిన వివరాలను పార్లమెంటుకు వివరించారు. 2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA చట్టానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున్న నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే.
దేశరాజధాని ఢిల్లీలోని షాహిన్ బాగ్ ఆందోళన కారులు పెద్ద ఎత్తున రోడ్లపై బైటాయించి పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసన దీక్షలు చేపట్టారు.ఈ నిరసనలు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందే కొద్దిరోజుల వరకు కొనసాగాయి. ఈ చట్టం ప్రకారం.. ఇస్లామిక్ దేశాలు అయిన పాకిస్థాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్‌లలో వివక్షకు గురవుతున్న హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు(ముస్లిములు మినహా)అందరికీ పౌరసత్వం ఇచ్చేందుకు తీసుకొచ్చారు.
అయితే, ఈ చట్టం దేశంలోని ముస్లిములకు వ్యతిరేకంగా తీసుకొచ్చారని పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఇన్నిరోజుల తర్వాత ఈ చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రిపేర్ అవుతున్నాయని కేంద్రమంత్రి తెలిపారు. సబార్డినేట్ లెజిస్లేషన్, లోక్‌సభ మరియు రాజ్యసభ కమిటీలు ఈ నిబంధనలను CAA కింద రూపొందించడానికి వరుసగా ఏప్రిల్ 9 అండ్ జూలై 9వరకు సమయం మంజూరు చేశాయి” అని లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు.