- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఒక్కటీ అడగొద్దంటున్న కేంద్రమంత్రి..
దిశ, వెబ్‌డెస్క్ : నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత కొన్నిరోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం యావత్భారతానికి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ -8వ తేదీన రైతులు భారత్ బంద్‌కు పిలుపునివ్వగా అది గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో సాగు చట్టాల్లో రైతులకు ఇబ్బందిగా మారిన అంశాలను సవరించేందుకు కేంద్రం అడుగు ముందుకు వేసింది. అంతేకాకుండా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రైతులను చర్చలకు ఆహ్వానించారు. అయినా, ఆ ప్రయత్నాలు అంతగా ఫలితాలనివ్వలేదు.
తాజాగా రైతుల ఆందోళనలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ స్పందించారు.రైతులు ఆందోళనలు విరమించి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. కానీ, సాగు చట్టాలను విరమించుకోవాలనే డిమాండ్‌ను మాత్రం రైతులు విరమించుకోవాలని ఆయన స్పష్టంచేశారు. చట్టాల్లో మీకు ఏయే అభ్యంతరాలున్నాయో వాటి చర్చిద్దాం.. రండి.. అంటూ సూచించారు.రైతులకు ఇబ్బందికరంగా కేంద్రం ఎలాంటి చర్యలకు పూనుకోవడం లేదని, కేవలం వ్యవసాయం రంగంలో సంస్కరణల కోసం ప్రయత్నిస్తోందని తోమర్ వెల్లడించారు.
ఇదిలాఉండగా, కేంద్రం ప్రతిపాదనలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు.ఈ విషయంలో ప్రధాని మోడీ ఓ స్పష్టమైన ప్రకటన చేయాలని రైతులు కోరుతున్నారు. లేనియెడల ఈ ఆందోళనలను ఉధృతం చేస్తామని, రైలు రోకోలు చేపడుతామని కేంద్రానికి అల్టీమేటం జారీ చేశారు.