బీజేపీలోకి ఈటల.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి .!

by Shyam |
బీజేపీలోకి ఈటల.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి .!
X

దిశ, వెబ్‌డెస్క్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు ఈటల నన్ను కలువలేదని, తనను కలిసేందుకు సంపద్రించిన మాట వాస్తవమే అని స్పష్టం చేశారు. ఈటల, నేను 15 ఏళ్లు కలిసి పనిచేశాం.. మేము కలిస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ఈటలను తాను కలిసినంత మాత్రానా పార్టీలో చేరేందుకు అనుకోలేము.

ఎప్పుడు కలువాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని కిషరెడ్డి వెల్లడించారు. హుజురాబాద్‌లో ఉపఎన్నిక వస్తే పోటీలో ఉండాలా వద్దా అనేది.. పార్టీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. ఇదిలాఉండగా, ఈటల రాజేందర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరారని, త్వరలోనే బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ సందర్భంగా కేంద్రమంత్రి క్లారిటీ నిచ్చారు.

Advertisement

Next Story