మావోయిస్టుల ఇలాకాలో అమిత్ షా టూర్.. టార్గెట్ ఫిక్స్ చేశారా.?

by Sridhar Babu |   ( Updated:2021-04-05 10:07:57.0  )
మావోయిస్టుల ఇలాకాలో అమిత్ షా టూర్.. టార్గెట్ ఫిక్స్ చేశారా.?
X

దిశప్రతినిధి, కరీంనగర్ : బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన 22 మంది అమర జవాన్లకు నివాళులు అర్పించేందుకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సోమవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించారు. పటిష్ట బందోబస్తు నడుమ బీజాపూర్‌లోని బసగూడ 168 సీఆర్పీఎఫ్ క్యాంపును ఆయన సందర్శించారు. మావోయిస్టుల ఇలాకగా చెప్పుకుంటున్న ప్రాంతంలోని క్యాంపునకు వెళ్లిన హోంమంత్రి జవాన్లతో కలిసి భోజనం చేశారు. అనంతరం తారెం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై ప్రత్యేకంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూంబింగ్ సమయంలో తమకు ఎదురవుతున్న సమస్యల గురించి జవాన్లు అమిత్ షాకు క్షుణ్ణంగా వివరించారు. సెర్చింగ్ ఆఫరేషన్‌లో తమకు మరిన్ని వనరులు అవసరం ఉందని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ఎన్‌కౌంటర్ కైసో హోవా..?

శనివారం జరిగిన ఎదురుకాల్పుల ఘటన గురించి అమిత్ షా జవాన్లను అడిగి తెలుసుకున్నారు. అసలెలా జరిగింది, మావోయిస్టులు దాడి ఎలా చేశారనే వివరాలను అడిగారు. మావోయిస్టుల దాడిని తిప్పికొట్టడంలో సమర్థవంతంగా పనిచేశారంటూ జవాన్లను అభినందించారు. ధైర్యంగా మావోల చర్యలను తిప్పికొట్టిన జవాన్ల పోరాటం ఆదర్శవంతమైందని కొనియాడారు.

జగ్దల్ పూర్‌లో..

ఉదయం జగ్దల్‌పూర్ హెడ్ క్వార్టర్స్‌లో మరణించిన అమర జవాన్లకు హోంమంత్రి నివాళులు అర్పించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భగెల్, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి వారికి శ్రద్ధంజాలి ఘటించారు. సాయంత్రం రాయ్‌పూర్‌కు వెల్లిన అమిత్ షా క్షతగాత్రులను పరామర్శించి సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed