దేశంలో కొత్తగా… 7 బుల్లెట్ రైళ్లు

by Anukaran |   ( Updated:2020-09-14 06:53:28.0  )
దేశంలో కొత్తగా… 7 బుల్లెట్ రైళ్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా మహమ్మారి విస్తృత వ్యాప్తి మూలంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు బ్రేక్ పడింది. కరోనా ఇప్పట్లో వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఒక్కొక్కటిగా లాక్‌డౌన్ ఆంక్షలను సడలించి, మళ్లీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో కొత్త ప్రాజెక్టును చేపట్టేందుకు కసరత్తు చేస్తోంది. రూ.10 ట్రిలియన్ల విలువైన మరో 7 బుల్లెట్ రైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు యోచిస్తోందని ఓ కేంద్ర ప్రభుత్వ నివేదిక వెల్లడించింది.

ఏడు కొత్త బుల్లెట్ రైలు ప్రాజెక్టులను నిర్మించడానికి రూ.10 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్టు బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. ఢిల్లీ నుంచి వారణాసి, ముంబై నుంచి నాగ్‌పూర్, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్, చెన్నై నుంచి మైసూరు, ఢిల్లీ నుంచి అమృత్‌సర్, ముంబై నుంచి హైదరాబాద్‌కు కొత్త ప్రాజెక్టులు కలుపుతాయి. ప్రాజెక్టు మొత్తం 4,869 కిలోమీటర్ల దూరం ఉంటుందని సమాచారం.

Read Also…

నెట్‌ఫ్లిక్స్ రద్దు.. నిరసనల పద్దు

Advertisement

Next Story

Most Viewed