రెండు డోసులు ఒకే టీకావి ఇవ్వాలి- కేంద్రం

by Shamantha N |   ( Updated:2021-06-01 07:52:01.0  )
రెండు డోసులు ఒకే టీకావి ఇవ్వాలి- కేంద్రం
X

న్యూఢిల్లీ: కరోనా టీకా పంపిణీ ప్రొటోకాల్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని, ఆ నిబంధనలకే కట్టుబడాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వేర్వేరు టీకా డోసులను పంపిణీ చేయాలని ఇంకా నిర్ణయించలేదని వివరించింది. సింగిల్ డోసు ఇవ్వాలనే వాదననూ అమలు చేయవద్దని తెలిపింది. ఫస్ట్, సెకండ్ డోసులను వేర్వేరు టీకాల డోసులను ఇవ్వాలన్న అంశంపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉన్నదని, వేర్వేరు డోసులు ఇస్తే మెరుగైన సామర్థ్యముంటుందని శాస్త్రీయంగా రూఢీ అయిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వివరించింది. కాబట్టి, తొలి డోసుగా కొవాగ్జిన్ టీకా ఇచ్చినప్పుడు నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత అదే టీకా డోసును రెండో డోసుగా ఇవ్వాలని, కొవిషీల్డ్ టీకాల డోసులను 12 వారాల ఎడంతో ఇవ్వాలని నీతి ఆయోగ్(ఆరోగ్య) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ అన్నారు.

ప్రస్తుతం అమల్లో ఉన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల పంపిణీ నిబంధనల్లో ఏ మార్పులు లేవని స్పష్టం చేశారు. ఇటీవలే వేర్వేరు డోసుల పంపిణీపై పరిశోధనలు, ఒకే డోసు పంపిణీపై కొందరు అధికారులు మాట్లాడిన నేపథ్యంలో తాజా స్పష్టీకరణ వచ్చింది.

Advertisement

Next Story