- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళల కోసం PM మోడీ అద్భుతమైన పథకాలు.. ఇలా డబ్బులు సంపాదించండి
దిశ, వెబ్‌డెస్క్ : స్త్రీశక్తి దేశానికి శక్తి అంటారు. మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. నేటి సమాజంలో మహిళలు వారి కుటుంబం, పిల్లల పెంపకం కోసం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఒక అడుగు ముందుకేసి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని శభాష్ అనిపిస్తున్నారు. అయితే ఇలా ఏదో చిన్న వ్యాపారం పెట్టి ఆర్థికంగా ముందుకు వెళ్దాం అనే మహిళలకు కేంద్ర ప్రభుత్వం చేయూతనందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు తీసుకొచ్చింది. మహిళలను ప్రోత్సహిస్తూ వారు వ్యాపారం చేయడానికి అండగా ఉంటానంటూ.. ముద్రన యోజన, స్త్రీశక్తి ప్యాకేజీ, అన్నపూర్ణ యోజన, ఉమెన్ ఎంటర్ ప్రైజ్ ఫండ్ వంటి పథకాలతో మహిళలను ప్రోత్సహిస్తోంది.
అయితే కొంత మంది మహిళలు కుటుంబంలో ఆర్థిక సమస్యల వలన సతమతం అవుతుంటారు. వారికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అలాంటి వారి కోసమే ఈ సమాచారం.
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం తీసుకొచ్చిన పథకాలు..
ముద్ర యోజన:
ఆర్థిక సమస్యలతో బాధపడేవారికి, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి పొందే వారికి చేయూతనిచ్చేలా 08 ఏప్రిల్ 2015 ప్రధాని నరేంద్ర మోదీ ‘ముద్ర’ యోజన ను ప్రారంభించారు. ఇందులో మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) తక్కువ వడ్డీ రేటుకే చిన్న వ్యాపారులకు రూ. 10 లక్షల దాకా రుణాలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఏ జాతీయ బ్యాంకు నుంచైనా రుణాలు తీసుకోవచ్చు. ఈ నిధుల సహాయంతో మహిళలు బ్యూటీ పార్లర్, ట్యూషన్ సెంటర్, టైలరింగ్ మొదలైన వాటిలో వ్యాపారాలు ప్రారంభించవచ్చు.
అర్హతలు :
- రుణ అవసరం 10 లక్షల లోపు ఉండాలి.
- భారత పౌరుడై ఉండాలి.
- ఒక వ్యవసాయేతర వ్యాపార ఆదాయ ప్రణాళిక సూచించే విధంగా ఉండాలి.
- ఉదాహరణకు తయారీ, ప్రాసెసింగ్, వ్యాపార లేదా సేవా రంగం.
స్త్రీ శక్తి ప్యాకేజీ:
ఈ పథకం మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్యాకేజీలో మహిళల యాజమాన్యంలోని వాటాలో 50% పైగా ఉన్న ఏ సంస్థ ద్వారానైనా రుణం లభిస్తుంది. అంతే కాకుండా రూ. 5 లక్షల వరకు ఎలాంటి భద్రత కల్పించాల్సిన అవసరం లేదు.చిన్న, మధ్య తరహా వ్యాపారం చేసుకోవడానికి ప్యాకేజీ ద్వారా 50 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తారు. అయితే ఎంఎస్‌ఎంఇలో నమోదు చేసుకున్న కంపెనీలకు 50 వేల నుంచి 25 లక్షల రూపాయల వరకు రుణాలు పొందే అవకాశం ఉంది. రుణ మొత్తం 2 లక్షలకు మించి ఉంటే వడ్డీ రేటు 5 % తగ్గుతుంది. స్త్రీ శక్తి ప్యాకేజీని సద్వినియోగం చేసుకోవడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించాలి.
అన్నపూర్ణ యోజన పథకం :
ఈ పథకం కింద భారత ప్రభుత్వం ఫుడ్ వ్యాపారం కోసం మహిళా పారిశ్రామికవేత్తలకు 50 వేల రూపాయల వరకు రుణాలు ఇస్తుంది. ఈ మొత్తాన్ని పాత్రలు కొనడానికి, గ్యాస్ కనెక్షన్ తీసుకోవడానికి, ఫ్రిజ్, మిక్సర్, టిఫిన్ బాక్స్, డైనింగ్ టేబుల్ వంటి వస్తువుల కొనుగోలుకు ఉపయోగించవచ్చు. ఈ రుణం కోసం గ్యారెంటీ అవసరం ఉంటుంది. ఈ రుణాన్ని 36 నెలల్లో తిరిగి చెల్లించాలి.
మహిళా సమృద్ధి యోజన..
సొంతంగా మహిళలు బిజినెస్ చేయాలనే వారి కలను దీని ద్వార నెరవేర్చుకోవచ్చు. గ్రామాల్లో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన మహిళలను ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని 1993లో తీసుకురావడం జరిగింది. వ్యాపారం ప్రారంభించడానికి అయ్యే ఖర్చుల కోసం బ్యాంక్ 60 వేల రూపాయల వరకు రుణాలు ఇస్తుంది. దీనిని 3 సంవత్సరాల 6 నెలల్లో చెల్లించాలి. ఇందుకోసం ఏటా 4% వడ్డీ మాత్రమే చెల్లించాలి. దారిద్య్రరేఖ (బిపిఎల్) క్రింద నివసిస్తున్న మహిళలు ఈ పథకాన్ని పొందవచ్చు. దీని కోసం ఎటువంటి హామీ లేదా భద్రతను సమర్పించాల్సిన అవసరం లేదు.