అందులో విజయవాడకు 4, విశాఖకు 9వ స్థానం

by Shamantha N |
అందులో విజయవాడకు 4, విశాఖకు 9వ స్థానం
X

దిశ, వెబ్‌డెస్క్: స్వచ్ఛ సర్వేక్షణ్-2020 అవార్డులను కేంద్రం గురువారం ప్రకటించింది. వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుధ్యానికి సంబంధించిన ఈ కార్యక్రమాన్ని కేంద్రం ప్రతిఏడాది నిర్వహిస్తోంది. దీనికి దేశంలోని 4242 పట్టణాలు, 62 కంటోన్మెంట్‌ బోర్డుల్లో కార్యక్రమం నిర్వహించింది. ఈ సర్వే చేపట్టి ఫలితాలను కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ గురువారం విడుదల చేశారు. 10 లక్షలకు పైబడిన నగరాల జాబితాలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నగరం వరుసగా నాలుగోసారి ప్రథమ స్థానంలో నిలిచింది.

రెండో ర్యాంకును సూరత్‌, మూడో ర్యాంకు నవీ ముంబయి దక్కించుకోగా, నాలుగో స్థానంలో విజయవాడ నిలిచింది. విశాఖ 9వ ర్యాంకు సాధించగా.. హైదరాబాద్‌ 23 స్థానంలో నిలిచింది.

అలాగే, లక్ష నుంచి 10లక్షలు జనాభా కలిగిన పట్టణాల జాబితాలో ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్‌ తొలి స్థానంలో నిలవగా.. మైసూర్‌ రెండో స్థానంలో, న్యూదిల్లీ (ఎన్‌డీఎంసీ) మూడో స్థానంలో నిలిచాయి. ఈ కేటగిరీలో తిరుపతి 6వ ర్యాంకు సాధించింది. స్వచ్ఛతపై ప్రపంచంలోనే అతి పెద్ద సర్వే ఇదేనని అధికారులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed