ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్

by Anukaran |   ( Updated:2021-01-01 01:41:42.0  )
ఉద్యోగులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ,వెబ్‌డెస్క్: కొత్త సంవత్సరం కానుకగా మోడీ సర్కార్ ఉద్యోగులకు శుభావార్త చెప్పింది. 2019-2020 ఆర్ధిక సంవత్సరానికి ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ పై 8.5శాతం వడ్డీని చెల్లిస్తూ కేంద్ర కార్మిక మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. గతేడాది మార్చి నెలలో గాంగ్వార్ నేతృత్వంలోని ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అఫెక్స్ కమిటీ అయ్యింది. ఈ భేటీలో 6 కోట్ల మంది ఉద్యోగులకు సెప్టెంబర్ నెలలో 8.5 శాతం వడ్డీని రెండు విడతలుగా 8.15 శాతం, 0.35 శాతంగా చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. కాగా త్వరలోనే కార్మిక మంత్రిత్వ శాఖ సంతోష్ గాంగ్వార్ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేయనున్నారు.

Advertisement

Next Story