సారీ… రిజర్వేషన్ ఇవ్వలేం.. శారీరక వికలాంగులకు కేంద్రం మొండిచేయి

by Shyam |
సారీ… రిజర్వేషన్ ఇవ్వలేం.. శారీరక వికలాంగులకు కేంద్రం మొండిచేయి
X

దిశ, తెలంగాణ బ్యూరో: శారీరక వికలాంగులకు కొన్ని రకాల పోస్టుల్లో ఉద్యోగాలు ఇవ్వలేమంటూ కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దివ్యాంగుల చట్టం (2016)లోని సెక్షన్ 34 ప్రకారం వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ అమలవుతున్నదని, కానీ ఆ శాఖ చీఫ్ కమిషనర్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత కొన్ని రకాల ఉద్యోగాల్లో వారికి ఇప్పటివరకూ ఉన్న రిజర్వేషన్లను ఎత్తివేస్తున్నట్లు కేంద్ర సోషల్ జస్టిస్ మంత్రిత్వశాఖ ఈ నెల 18వ తేదీన విడుదల చేసిన గెజిట్ ద్వారా స్పష్టం చేసింది. ఐపీఎస్ కేటగిరీ కింద ఉన్న అన్ని పోస్టులు, ఢిల్లీ పోలీసు సహా అండమాన్, లక్షద్వీప్, డయ్యూడామన్, దాద్రానగర్ తదితర అన్ని పోలీసు విభాగాలు, దేశంలోని ఆర్పీఎఫ్ విభాగంలో ఉన్న అన్ని పోస్టులకు శారీరక వికలాంగులకు ఎలాంటి రిజర్వేషన్ ఉండదని స్పష్టం చేసింది.

ఇదే తరహాలో కొన్ని రకాల ప్రత్యేక విధులు నిర్వహించే పోస్టులతో పాటు బీఎస్ఎఫ్, సీఏపీఎఫ్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ, సశస్త్ర సీమా బల్, అస్సాం రైఫిల్స్ లాంటి విభాగాల్లోని అన్ని రకాల పోస్టులకు వీరికి ప్రత్యేక రిజర్వేషన్ ఉండదని పేర్కొన్నది.

Advertisement

Next Story

Most Viewed