ఆశాదేవి.. ఆశాదీపం

by Shamantha N |
ఆశాదేవి.. ఆశాదీపం
X

ఏడు నిమిషాల్లో ఓ జీవితాన్ని చిదిమేసిన ఘటనలో.. ఏడేళ్ల తర్వాత న్యాయం జరగింది. ఒక తల్లి అలుపెరగని సుదీర్ఘ పోరాటం.. ఆ బిడ్డ ఆత్మకు శాంతినిచ్చింది. దోషుల డ్రామాలు… కోర్టు మలుపులు తర్వాత ఎట్టకేలకు న్యాయం జరిగింది. కిరాతకులకు తగిన శాస్తి జరిగింది. నిర్భయకు న్యాయం జరగాలన్న ఏడేళ్ల నినాదాలకు.. నేడు సమాధానం దొరికింది. నిర్భయ కేసులో దోషులకు ఉరిశిక్ష అమలుపై సామాన్యులు, ప్రముఖులు హర్షం వ్యక్తం అవుతున్నా… ఇంత సమయం తీసుకోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టంలో మరిన్ని సంస్కరణలు రావాలని కోరుతున్నారు.

నిర్భయ తల్లి నా హీరో: ప్రణిత సుభాష్

నిర్బయ కేసులో సుదీర్ఘ పోరాటం తర్వాత ఈరోజు భారతదేశానికి న్యాయం జరిగిందని ట్వీట్ చేసింది హీరోయిన్ ప్రణితా సుభాష్. ఇప్పుడు మన మధ్య కొత్త హీరో ఉన్నారు.. తనే నిర్భయతల్లి. ఈ కేసు భారతీయ న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచిందని, రేపిస్టులందరికీ ఒక బలమైన సందేశాన్ని పంపుతుందని అభిప్రాయపడింది. చట్టం చివరికి వారిని శిక్షిస్తుందనే భయాన్ని పుట్టించిందని తెలిపింది ప్రణిత.

ఆశాదేవి.. గొప్ప యుద్ధం చేశారు: తాప్సీ

చివరకు న్యాయం జరిగింది. నిర్భయకేసు దోషులకు ఉరిశిక్ష పడింది. ఏడేళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత విజయాన్ని అందుకున్న నిర్భయ తల్లిదండ్రులు… కనీసం ఈ రోజైనా కాస్త ప్రశాంతంగా నిద్రపోతారేమో చూడాలి. ఆశాదేవి గారు మీకు సలామ్ అంటూ పోస్ట్ పెట్టింది హీరోయిన్ తాప్సీ.

అప్పుడే జరిగితే.. అత్యాచారాలు ఆగేవేమో: ప్రీతి జింతా

నిర్భయ రేపిస్టులను 2012లోనే ఉరితీస్తే… మహిళలపై జరిగిన అత్యాచారాలను ఆపే వాళ్లమేమో అని అభిప్రాయపడింది ప్రీతి జింతా. చట్టవిరుద్ధమైన పనులు చేసే వారిని ఇలాంటి ఘటనలు అదుపులో ఉంచుతాయని తెలిపింది. న్యాయం కోసం భారత ప్రభుత్వం చట్టంలో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని కోరింది.

తప్పు చేస్తే తప్పించుకోలేరు : వరలక్ష్మి

నిర్భయపై అత్యాచారం జరిగింది… దారుణంగా హింసించబడింది… మరణంతో పోరాడి ఓడిందని ఆవేదన వ్యక్తం చేసింది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్. కానీ పోరాట యోధురాలుగా మిగిలిపోతుందని తెలిపింది. ఏడు నిమిషాల్లో నిర్భయ జీవితాన్ని నాశనం చేసిన ఈ జంతువులను ఉరితీసేందుకు ఏడు ఏళ్లు పట్టిందని .. కనీసం ఈ కేసుతో అయినా రేప్ జరిగితే మరణం తప్పదనే భయం కలుగుతుందనే విశ్వాసం వ్యక్తం చేసింది. నిర్భయ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంది.

చివరికి న్యాయం గెలిచింది: కార్తీ

నిర్భయ కేసులో ఎనిమిదేళ్ల తర్వాత చివరికి న్యాయం జరిగిందంటూ ట్వీట్ చేశాడు హీరో కార్తీ. మరి పొల్లాచ్చి కేసులో న్యాయం జరిగేందుకు ఎంత సమయం తీసుకుంటుందో అని ఆలోచించాక ఆశ్చర్యపోతున్నాను… ఇప్పటికే ఏడాది గడిచిపోయిందన్నాడు. మనం దీని ద్వారా నేర్చుకున్న పాఠాలను మరిచిపోకూడదనే అనుకుంటున్నానని … ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపాడు.

బోలెడు రిలీఫ్ ఇచ్చింది: హరీశ్ శంకర్

నిర్భయ కేసు దోషులకు శిక్ష అమలు అవడం అనేది చాలా ఆనందమైన విషయంగా అభివర్ణించారు దర్శకులు హరీశ్ శంకర్. ఒకరి చావు నాకు బోలెడు రిలీఫ్ ఇస్తుందని ఎప్పుడూ అనుకోలేదని.. కానీ, అంత రిలీఫ్ ఇప్పుడు దొరికిందని తెలిపారు. అలాగే ఈ శిక్ష కొతం మందికి భయాన్నిస్తే చాలు అని కోరుకున్నారు డైరెక్టర్.

న్యాయం జరిగినందుకు సంతోషం: తమన్నా

నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలుపై సినీనటి తమన్నా భాటియా స్పందించింది. ఇప్పటికైనా న్యాయం దక్కడం ఆనందంగా ఉందని, ఇలాంటి గొప్పవార్త ఈ రోజు మొదలైందని తెలిపింది. వరల్డ్ హ్యాపినెస్ డే.. ఈ వార్త చాలా హ్యాపినెస్ ఇచ్చిందని తెలిపింది.

Tags: tweets on nirbhaya convicts hanging, asha devi, tamanna, taapsee

Advertisement

Next Story

Most Viewed