- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నడిరోడ్డుపై జడ్జి దారుణ హత్య.. వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: జార్ఖండ్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ న్యాయమూర్తిని నడిరోడ్డుమీద అత్యంత దారుణంగా హత్య చేశారు. ప్రస్తుతం ఆ హత్యకు సంబంధించిన వీడియో జార్ఖండ్ లో సంచలనం సృష్టిస్తోంది. వివరాలలోకి వెళితే.. ధన్‌బాద్ జిల్లా అడిషినల్, సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్ బుధవారం ఉదయం మేయిన్ రోడ్డుపై జాగింగ్ చేస్తున్నారు. ఆ సమయంలోనే అతని వెనక నుంచి వస్తున్న ఒక ఆటో ఆయనను ఢీకొన్నది. ఉత్తమ్ అక్కడికక్కడే మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో ఆయన మృతిచెందినట్లు బుధవారం వార్తలు వచ్చాయి. అయితే.. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులకు సంచలన నిజాలు తెలిసాయి. ఈ కేసులో సీసీ టీవీ ఫుటేజ్ ని చెక్ చేసిన పోలీసులు ఇది ప్రమాదం కాదని హత్య అని నిర్దారించారు.
Jharkhand Judge dеаth case- WATCH CCTV Footage. Shows he was knocked down DELIBERATELY while he was going on morning walk!! 😱😑 #Jharkhand #Dhanbad pic.twitter.com/jiZk7g61Lb
— Rosy (@rose_k01) July 29, 2021
జడ్జిని కావాలనే ఆటోతో ఢీకోట్టినట్లు ఆ సీసీ టీవీ కెమెరాలో స్పష్టంగా తెలుస్తోంది. ఎవరో కావాలనే ఆయనను టెంపోతో ఢీ కొట్టి..రోడ్డు యాక్సిడెంట్ లో ఆయన మరణించినట్టు క్రియేట్ చేసినట్లుగా పోలీసులు వారి విచారణలో నిర్ధారించారు. ఆటో డ్రైవ్ చేసిన డ్రైవర్ ని పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా.. ఆ ఆటో కూడా దొంగిలించిందని తెలిసింది. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపి పూర్తి వివరాలను తెలిపాలని బార్ అసోసియేషన్ సుప్రీం కోర్ట్ ని డిమాండ్ చేసింది.