‘ఆ ఒక్కటి 100 మంది పోలీసులతో సమానం’

by Shyam |
‘ఆ ఒక్కటి 100 మంది పోలీసులతో సమానం’
X

దిశ, హైదరాబాద్: కుషాయిగూడ పరిధి భవానీనగర్‎లో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్ సీసీ టీవీ కెమెరాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్థానిక కాలనీ వాసుల విరాళాల ద్వారా రూ.16 లక్షల వ్యయంతో.. మొత్తం 108 సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిని సురక్షితంగా ఉంచేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. నేరస్థులను పట్టుకోవడంలో సీసీ టీవీలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. కేసు దర్యాప్తు ప్రక్రియ మరింత వేగవంతం అవుతోందని చెప్పారు. ఒక్క సీసీ టీవీ 100 మంది పోలీసులతో సమానమని సీపీ, ఎమ్మెల్యే అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మల్కాజిగిరి డీసీపీ రక్షిత కె.మూర్తి, కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, ఇన్‌స్పెక్టర్ విజయ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story