- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. అసలు సూత్రధారి ఎవరో చెప్పేసిన సీబీఐ
దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సంచలన విషయాలను సీబీఐ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ విషయాలను పులివెందుల కోర్టు ధర్మాసనం ఎదుట ఉంచింది. వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయినట్టు తొలుత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి వెల్లడించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. వివేకా హత్యకు కుట్ర, ఆయన గుండెపోటుతో చనిపోయారన్న ప్రచారం చేయాలన్న సిద్ధాంతానికి ఆద్యుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డియేనని సీబీఐ నివేదికలో తెలిపింది.
వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారంటూ మీడియాకు సైతం సమాచారం ఇచ్చిన వారిలో శంకర్ రెడ్డి కూడా ఉన్నట్లు తెలిపింది. హత్య జరిగిన ప్రాంతంలో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ధ్వంసం చేశారని, వివేకా శరీరంపై ఉన్న గాయాలన్నింటికీ గజ్జల జై ప్రకాశ్‌రెడ్డి అనే కాంపౌండర్‌తో బ్యాండేజీ వేయించి కట్టుకట్టించిన వారిలో దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రథముడు అంటూ సీబీఐ ఆరోపించింది. ఈ సందర్భంగా దర్యాప్తుపై ఇటీవల కొందరు సోషల్ మీడియా వేదిక చేస్తున్న ఆరోపణలపైనా సీబీఐ స్పందించింది.
ఈ కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు కొందరు కొత్త కొత్త పేర్లను తెరపైకి తీసుకొస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న శివశంకర్‌రెడ్డికి బెయిలు ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ కోర్టుకు తెలియజేసింది. అంతేకాదు తమ కళ్లుగప్పి పరారయ్యే అవకాశం లేకపోలేదని వెల్లడించింది. మరోవైపు ఈ కేసులో అప్రూవర్‌గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్‌ను సీబీఐ ప్రత్యేకంగా ప్రస్తావించింది. వివేకాను హత్య చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తానని సునీల్ కుమార్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, షేక్ దస్తగిరిలకు శివశంకర్‌రెడ్డి ఆశ చూపినట్లు సీబీఐ దర్యాప్తు నివేదికలో స్పష్టం చేసింది.
మరోవైపు హత్య జరిగిన రోజు స్పాట్‌కు వచ్చిన సీఐ శంకరయ్యను సైతం దేవిరెడ్డి శంకర్ రెడ్డి బెదిరించినట్లు ఆరోపించింది. వివేకా హత్యపై దర్యాప్తు చేసేందుకు సీఐ శంకరయ్య ప్రయత్నిస్తుండగా.. ఆయన గుండెపోటు, రక్తపు వాంతులతో చనిపోయారని తాము చెబుతున్నామని.. కాబట్టి ఈ విషయంలో సైలెంట్‌గా ఉండాలంటూ సీఐ శంకరయ్యను హెచ్చరించినట్లు సీబీఐ తన నివేదికలో పేర్కొంది. అంతేకాదు కేసు దర్యాప్తు ఆరంభం నుంచి సాక్షులను బెదిరించారని సీబీఐ తన దర్యాప్తు నివేదికలో పొందుపరిచింది.
- Tags
- cbi