- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రముఖ జర్నలిస్టు ‘రానా అయ్యూబ్’పై కేసు.. అదిరిపోయిన కౌంటర్!
దిశ, వెబ్‌డెస్క్ : ప్రముఖ జర్నలిస్టు రానా అయ్యూబ్‌పై కేసు నమోదైంది. కొవిడ్ -19 ఉపశమనం కోసం ఆమె సేకరించిన నిధులను దుర్వినియోగం చేశారనే కారణంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు రానా అయ్యూబ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. దీనపై స్పందించిన ఆమె.. FIR “హానికరమైనది, నిరాధారమైనది” అని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఈ ఆరోపణ ఆధారంగా నేను సోషల్ మీడియాలో అపకీర్తి చెందాను, ట్రోల్ చేయబడ్డాను మరియు దుర్వినియోగం అయ్యాను.’
I shall continue to do my journalism. pic.twitter.com/ItBQFSNEuw
— Rana Ayyub (@RanaAyyub) September 11, 2021
తాను ‘ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయలేదని.. తాను సేకరించిన భారీ విరాళాలపై సీబీడీటీ పన్నులు అధికంగా విధించడం వల్లే నిధులు తగ్గిపోయాయని వెల్లడించారు. హిందూ ఐటీ సెల్ విభాగం వారు తనపై బేస్‌లెస్ ఆరోపణలు చేశారని ఆన్‌లైన్ వేదికగా విమర్శించారు. తనపై ఎన్ని ఆరోపణలు వచ్చినా.. కేసులు పెట్టినా.. ముందుకే వెళ్తాను గానీ, తగ్గేది లేదని రానా అయ్యూబ్ స్పష్టంచేశారు.