NLC Recruitment: నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు.. పోస్టులు, అర్హత, జీతం వివరాలివే..!

by Maddikunta Saikiran |
NLC Recruitment: నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగ అవకాశాలు.. పోస్టులు, అర్హత, జీతం వివరాలివే..!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు(TN)లోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(NLCIL) పలు ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 167 గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(GET) పోస్టులను భర్తీ చేయనున్నారు. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత గల విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://www.nlcindia.in/new_website/index.htm ద్వారా అప్లై చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15 జనవరి 2025.

పోస్టు పేరు, ఖాళీలు:

గ్రాడ్యుయేట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ - 167

విద్యార్హత:

సంబంధిత విభాగంలో డిగ్రీ ఉతీర్ణులై ఉండాలి. అలాగే గేట్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి.

ఎంపిక విధానం:

గేట్ స్కోర్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 854. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 354 ఫీజు ఉంటుంది.

జీతం:

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50,000 నుంచి రూ. 1,60,000 జీతం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed