Defense Jobs: రక్షణ శాఖకు చెందిన ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ లో ఉద్యోగ అవకాశాలు.. పోస్టులు, అర్హత, జీతం డీటెయిల్స్ ఇవే..!

by Maddikunta Saikiran |
Defense Jobs: రక్షణ శాఖకు చెందిన ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ లో ఉద్యోగ అవకాశాలు.. పోస్టులు, అర్హత, జీతం డీటెయిల్స్ ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్: మెదక్(Medak)లోని రక్షణ శాఖ(Defense Department)కు చెందిన ఆర్మ్డ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్(AVNL) అనుబంధ సంస్థ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ(AF) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 86 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://avnl.co.in/ ద్వారా ఆన్‌లైన్(Online)లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోడానికి చివరి తేదీ 2 డిసెంబర్ 2024.

పోస్టు పేరు, ఖాళీలు:

  • జూనియర్ మేనేజర్ - 50
  • డిప్లొమా టెక్నీషియన్ - 21
  • అసిస్టెంట్ - 11
  • జూనియర్ అసిస్టెంట్ - 04

విద్యార్హత:

పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ(బీఏ, బీఎస్సీ, బీకామ్), బీఈ/బీటెక్, ఎంకామ్,ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు.. పని చేసిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

30 ఏళ్లు మించి ఉండకూడదు. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

విద్యార్హతలు, పని అనుభావం, స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు ఫీజు :

జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 300, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం:

జూనియర్ మేనేజర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 30,000, డిప్లొమా టెక్నీషియన్ పోస్టులకు రూ. 23,000, అసిస్టెంట్ పోస్టులకు రూ. 23,000, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ. 21,000 వరకు జీతం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed