ఇంటర్ తర్వాత కెరీర్.. ఎంపీసీ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలేంటో తెలుసా..?

by Vinod kumar |   ( Updated:2023-04-13 13:59:02.0  )
ఇంటర్ తర్వాత కెరీర్.. ఎంపీసీ విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలేంటో తెలుసా..?
X

దిశ, కెరీర్: ఇంటర్ తర్వాత విద్యార్థులకు విరివిగా కెరీర్ అవకాశాలున్నాయి. వాటిలో ఏది మంచి కెరీర్.. అలాగే ఏ కోర్సు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందనేది.. విద్యార్థుల్లో మెదిలే ప్రశ్న.. విద్యార్థి ఏ రంగంలో ఉన్నత విద్య చేయాలో నిర్ణయించుకొని దానికి తగిన విధంగా కోర్సు ఎంపిక చేసుకుంటే మంచి కెరీర్ ఉంటుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, ఆర్ట్స్ రంగాల్లో కోర్సుల వివరాలు తెలుసుకుందాం..

ఎంపీసీ విద్యార్థులకు మేలైన కోర్సులు:

ఎంపీసీ చదివిన విద్యార్ధులకు కెరీర్‌ అవకాశాలు విరివిగా ఉంటాయి. ఎక్కవ మంది విద్యార్థుల మొదటి ఎంపిక ఇంజనీరింగ్‌.. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో ఉన్న అవకాశాలు మరే ఇతర కెర్సులో ఉండవనే చెప్పాలి. సరైన ప్రతిభ కనబరిస్తే ఇంజనీరింగ్‌తో మంచి కెరీర్ ఉంటుంది. ఇంటర్‌లో ఎంపీసీ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజనీరింగ్ లేదా డిగ్రీ కోర్సులు ఎంపిక చేసుకోవచ్చు.

ఇంజనీరింగ్ కెరీర్:

ఎంపీసీ చదివిన విద్యార్ధుల్లో అధికశాతం ఇంజనీరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, యూనివర్సిటీల పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. దీనికి ప్రతి ఏడాది జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇది మెయిన్, అడ్వాన్స్‌డ్ అనే రెండు దశలుగా ఉంటుంది. జేఈఈ మెయిన్‌లో ర్యాంకు సాధించిన విద్యార్ధులు ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లోప్రవేశాలు పొందవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసిన విద్యార్ధుల ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంసెట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంసెట్ ర్యాంకు ద్వారా ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ పొందవచ్చు.

బిట్‌శాట్:

దీని ద్వారా ప్రముఖ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. అలాగే వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, తదితర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు ఎ:ట్రన్స్ పరీక్షల ద్వారా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ముఖ్యమైన ఇంజనీరింగ్ కోర్సులు:

ఏరోస్పేస్ ఇంజనీరింగ్:

ఈ ఇంజనీరింగ్‌ కోర్సులో విమానాలపై పరిశోధనలు, రూపకల్సన, అభివృద్ధి, నిర్మాణం, టెస్టింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలుంటాయి. స్పేస్‌క్రాఫ్ట్, అంతరిక్షంలోని అంశాలపై లోతుగా దృష్టి సారించి, ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్‌ను కూడా అధ్యయనం చేయవచ్చు. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివితే, ఏరోడైనమిక్స్, ఏరోలాస్టిసిటీ, కాంపోజిట్స్ అనాలిసిస్, ఏవియానిక్స్, ప్రొపల్షన్ మరియు స్ట్రక్చర్స్ మరియు మెటీరియల్స్‌లో నైపుణ్యం పొందవచ్చు.

కెమికల్ ఇంజనీరింగ్:

ఈ రకమైన ఇంజనీరింగ్ పదార్ధాలను ఉత్పత్తి చేయడానికి రసాయన, జీవ ప్రక్రియల వినియోగానికి సంబంధించినది. కెమికల్ ఇంజనీరింగ్ చదవాలని ఎంచుకుంటే, కెమికల్ రియాక్షన్ ఇంజినీరింగ్, ప్లాంట్ డిజైన్, ప్రాసెస్ ఇంజనీరింగ్, ప్రాసెస్ డిజైన్ లేదా ట్రాన్స్‌పోర్ట్ వంటి వాటిలో నైపుణ్యం పొందవచ్చు.

సివిల్ ఇంజనీరింగ్:

సివిల్ ఇంజనీరింగ్ అనేది మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పన, అభివృద్ధికి సంబంధించినది. సివిల్ ఇంజనీరింగ్‌లో.. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ మరియు హైడ్రాలిక్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్లు కూడా ఉన్నాయి.

కంప్యూటర్ ఇంజనీరింగ్

కంప్యూటర్ ఇంజనీరింగ్ కంప్యూటింగ్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు సంబంధించినది. కంప్యూటర్స్‌కు సంబంధించిన ఇంజనీరింగ్ కెరీర్‌పై ఆసక్తి కలిగి ఉంటే సాఫ్ట్‌వేర్ డెవలపర్ లేదా కంప్యూటర్ ఇంజనీర్ గా మంచి అవకాశాలుంటాయి.

ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్

ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రెండూ ఎలక్ట్రికల్ పవర్ అనువర్తనాలకు సంబంధించినవే.. అయితే విద్యుత్ ఉత్పత్తి తో పాటు విద్యుత్ సరఫరాపై దృష్టి సారించడంలో రెండు రంగాలు విభిన్నంగా ఉంటాయి. అయితే ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లు ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌లపై దృష్టి పెడతారు. ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో నైపుణ్యాలు ఈ నైపుణ్యాలు పొందవచ్చు. అవి.. విద్యుత్ ఉత్పత్తి- సరఫరా, కమ్యూనికేషన్స్ మరియు మీడియా, కంప్యూటర్ సిస్టమ్స్, రోబోటిక్ సిస్టమ్స్.

మెకానికల్ ఇంజనీరింగ్

మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ సిస్టమ్‌ల రూపకల్పన, తయారీ, నిర్వహణకు సంబంధించినది. ఈ కోర్సులో స్టాటిక్స్ , డైనమిక్స్, థర్మోడైనమిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్, స్ట్రెస్ అనాలిసిస్, మెకానికల్ డిజైన్ అండ్ టెక్నికల్ డ్రాయింగ్‌లను అధ్యయనం చేస్తారు. ఇది చాలా విస్తృతమైనది. ఇది మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌ను కంప్యూటర్ మరియు కంట్రోల్ ఇంజనీరింగ్ వంటి రంగాల మిశ్రమంగా చెప్పవచ్చు.

ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్:

మరో ఇంటర్ డిసిప్లినరీ ఫీల్డ్, ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్.. ఇటీవలి కాలంలో ఇది అభివృద్ధి చెందింది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు పుట్టుకొస్తుంటాయి. ఆకోవకు చేందిందే ఈ ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ కోర్సు. యూనివర్సిటీ లు దీనిని పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి చేసి అందిస్తున్నాయి.

వివిధ ఎంట్రన్స్ పరీక్షలు:

JEE MAIN

JEE ADVANCED

EAMCET

ECET

AUEET

VITEE

SRNJEE

MET

AEEE

LPUNEST

GAT

SITEEE

KLEEE

KIITEE

PESSAT

Also Read...

ఐసర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ - 2023 నోటిఫికేషన్ విడుదల

Advertisement

Next Story

Most Viewed