ఏపీ పీజీసెట్ 2023 నోటిఫికేషన్ రిలీజ్

by S Gopi |
ఏపీ పీజీసెట్ 2023 నోటిఫికేషన్ రిలీజ్
X

దిశ, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -2023 షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ పరీక్షను విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. మొత్తం 17 యూనివర్సిటీల్లోని దాదాపు 145 కోర్సులకు ఈ పరీక్ష ద్వారా అడ్మిషన్ పొందవచ్చు.

పరీక్ష: పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2023 (ఏపీ పీజీసెట్)

కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే,ఎంఎల్ఐబీఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీటెక్...

అర్హత: సంబంధిత సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా చివరి ఏడాది ఎగ్జామ్ రాసివారు అర్హులు.

పరీక్ష ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 850, బీసీలకు రూ. 750; ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు రూ. 650 ఉంటుంది.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభతేది: ఏప్రిల్ 1, 2023.

చివరితేది: మే 11, 2023.

పరీక్షలు ప్రారంభం: జూన్ 6, 2023.

వెబ్‌సైట్: https://cets.apsche.ap.gov.in

Advertisement

Next Story