Latest Current Affairs 14.02.2023: కరెంట్ అఫైర్స్ .. (గ్రూప్ -2,3,4 /జేఎల్.. ఎస్సై, కానిస్టేబుల్ స్పెషల్)

by sudharani |   ( Updated:2023-02-14 15:27:12.0  )
Latest Current Affairs  14.02.2023:  కరెంట్ అఫైర్స్ .. (గ్రూప్ -2,3,4 /జేఎల్.. ఎస్సై, కానిస్టేబుల్ స్పెషల్)
X

దక్షిణాఫ్రికాలో.. స్టేట్ ఆఫ్ డిజాస్టర్:

దక్షిణాఫ్రికాలో తీవ్ర విద్యుత్ సంక్షోభం రావడంతో.. దేశంలో విపత్తు అత్యయిక స్థితి (స్టేట్ ఆఫ్ డిజాస్టర్)ని విధిస్తున్నట్లు అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ప్రకటించారు. దక్షిణాఫ్రికాకు ఏకైక విద్యుత్ సరఫరా సంస్థ అయిన ఎస్కామ్ దివాళా తీయడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది.

ఢిల్లీ ఎక్స్ ప్రెస్ వేలో మొదటి దశ ప్రారంభం:

కేంద్ర ప్రభుత్వం రూ. లక్ష కోట్లతో చేపట్టిన ఢిల్లీ - ముంబయి ఎక్స్ ప్రెస్ వే (1,386 కి.మీ) లో 246 కి.మీ. మొదటి దశ సోహ్నా- దౌసా రహదారిని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్ లోని దౌసాలో ప్రారంభించారు. ఢిల్లీ -దౌసా-లాల్‌సాట్ మధ్య పూర్తయిన ఈ రహదారితో దేశ రాజధాని నగరం, జైపూర్ మధ్య ప్రయాణ సమయం 5 గంటల నుంచి రెండు గంటలకు తగ్గనుంది. ప్రపంచంలోనే రికార్డు స్థాయి వేగంతో పూర్తవుతున్న హైవేగా పేరొందిన ఈ రహదారి వల్ల దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబయి మధ్య ప్రస్తుతమున్న దూరం 180 కి.మీ మేర తగ్గుతుంది.

ద్రవ్య వినిమయం బిల్లుకు ఆమోదం:

సమావేశాల చివరి రోజున తెలంగాణ శాసనసభ, మండలిలు రాష్ట్ర ప్రభుత్వ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లును ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రవేశ పెట్టారు. చివరి రోజు శాసనసభలో చర్చకు ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానమిచ్చారు. మండలిలో చర్చకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమాధానాలు ఇచ్చారు. అనంతరం రెండు సభలు బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.

ఏపీ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్:

కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌ను నియమించింది. ఇప్పటివరకు ఇక్కడ ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్ గఢ్‌కు బదిలీ చేసింది. మొత్తం 13 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది.

ఎన్‌హెచ్ఆర్‌డీ 25వ జాతీయ సదస్సు:

నేషనల్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ నెట్‌వర్క్ (ఎన్‌హెచ్ఆర్‌డీ) 25వ జాతీయ సదస్సు మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో జరిగింది. ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచానికి అవసరమైన టీకాల్లో మూడో వంతు ఇక్కడి నుంచే ఉత్పత్తి చేస్తూ ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ పేరు గడించిందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

BSF Recruitment 2023 :బీఎస్ఎఫ్‌లో ఏఎస్ఐ.. కానిస్టేబుల్ పోస్టులు..

Advertisement

Next Story