- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నగర శివారులో అర్ధరాత్రి కారు బీభత్సం..
దిశ, కుత్బుల్లాపూర్ : నగర శివారులో కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకువచ్చి డివైడర్ పైకి ఎక్కడంతో పల్టీ కొట్టింది. ఈ సంఘటన బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై భాను ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. టీఎస్ 08 ఈపీ 0681 నెంబరు గల షిఫ్ట్ డిజైర్ కారు కొంపల్లి సిగ్నల్ నుండి సుచిత్ర వైపు ఆదివారం అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో వస్తుంది. బిగ్ బజార్ సమీపంలోకి రాగానే వేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్ పైకి వెళ్లి పల్టీ కొట్టింది. విషయం తెలుసుకున్న సీఐ రమేష్, ఎస్సై భాను ప్రసాద్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కారులో ఉన్న శ్రీనివాస్, పండిత్ , పవన్‌లను బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించారు. ఒకరి తలకు తీవ్ర గాయాలవగా, ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా ఆర్మూర్ నుండి నగరంలోని బేగంపేటకు వెళ్తున్నారని తెలిపారు. అయితే కారులో ఒక కాటన్ బీర్ల వరకున్నాయి. వెళ్లినప్పటి నుండి కారులోనే మద్యం సేవించారని తెలుస్తోంది. ఇదే తరహాలో ఆదివారం ఉదయం 2 గంటలకు బౌరంపేట్‌లో ప్రమాదం జరిగి ముగ్గురు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.