రాజధాని బిల్లు ఉపసంహరణ జగన్నాటకమే : చంద్రబాబు

by Anukaran |
రాజధాని బిల్లు ఉపసంహరణ జగన్నాటకమే : చంద్రబాబు
X

దిశ, ఏపీ బ్యూరో: మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నట్లు అసెంబ్లీలో సీఎం ప్రకటించడం జగన్ కొత్తనాటకమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలోని సమస్యలు, వైసీపీ పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు ప్రభుత్వం తీరును ఎండగట్టారు. మూడు రాజధానుల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప రెండున్నరేళ్లలో 3 ప్రాంతాల్లో పైసా ఖర్చు చేశారా? అని నిలదీశారు.

రాష్ట్రంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప జగన్ చేసిన అభివృద్ధి ఏంటని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు మెజార్టీ స్థానాల్లో వైసీపీని గెలిపించారు. నేడు ఆ ప్రాంతంలో వరదలతో ‎ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం పక్క రాష్ట్రాల్లో పెళ్లి విందులు, వినోదాలతో కాలక్షేపం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అసెంబ్లీలో మహిళలపై వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల వ్యక్తిగత దుర్బాషల్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. వీటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు 3 రాజధానులు బిల్లు ఉపసంహరించుకున్నారని చంద్రబాబు ఆరోపించారు.

మరోవైపు వన్ టైం సెటిల్మెంట్ పేరుతో గృహ లబ్ధిదారుల నుంచి నిర్ణీత మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. అవి కట్టకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ డబ్బులు ఎవరూ చెల్లించాల్సిన అవసరం లేదు. టీడీపీ ప్రభుత్వం రాగానే దాన్ని నిలిపివేసి ఉచితంగా లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాం. పథకాలు ఆసేస్తామంటే భయపడొద్దు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు రానివ్వకుండా అడ్డుకునే హక్కు ఎవరికి లేదు. పథకాలు ఆపేస్తే న్యాయస్థానంలో పోరాటం చేస్తాం అని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

కోర్టు నుంచి తప్పించుకునేందుకే ఈ నిర్ణయం : పవన్ కల్యాణ్

Next Story

Most Viewed