దారుణం.. గంజాయి అమ్మొద్దు అంటే కత్తులతో దాడి

by Sumithra |
దారుణం.. గంజాయి అమ్మొద్దు అంటే కత్తులతో దాడి
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నగరంలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. రెండు నెలల క్రితం 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్‌ను గంజాయి బ్యాచ్ హత్య చేసిన విషయం తెల్సిందే. బుధవారం రాత్రి నగరంలోని 6వ టౌన్ పరిధిలో నిజాం కాలనీలో ఓ యువకుడిపై కత్తులతో దాడి చేశారు. సుల్తాన్ అనే గంజాయి విక్రేత తన ఇంటి ముందు గంజాయిని అమ్మకాలు చేయవద్దన్నందుకు మాజిద్ అనే యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో మాజిద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఓ మజ్లిస్ పార్టీకి చెందిన నేత కేసు నమోదు చేయనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

Next Story