శాంతియుత నిరసనకారులకు మా మద్దతు : ట్రుడో

by Shamantha N |   ( Updated:2020-12-01 09:50:05.0  )
శాంతియుత నిరసనకారులకు మా మద్దతు : ట్రుడో
X

న్యూఢిల్లీ: దేశరాజధాని సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో మద్దతు తెలిపారు. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. గురునానక్ జయంతిని పురస్కరించుకుని కెనడాలోని పంజాబీలను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. భారత్‌లోని మిత్రులు, కుటుంబ సభ్యుల గురించిన ఆందోళన ఇక్కడ కనిపిస్తున్నదని అన్నారు. శాంతియుత నిరసనకారులకు కెనడా ఎల్లప్పుడు మద్దతిస్తుందన్న విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పారు. చర్చల ద్వారా పరిష్కారమనే సూత్రాన్ని తాము నమ్ముతామని, కెనడా అభిప్రాయాన్ని వెలిబుచ్చడానికి భారత అధికారులకు పలుసార్లు వివరించామని తెలిపారు.

అనుచితం..
సరైన వివరాలు లేకుండా కొందరు కెనడా లీడర్లు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఒక ప్రజాస్వామిక దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. దౌత్య చర్చలను రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుగా చిత్రించవద్దని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed