- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధిక ఫీజులు వసూలు చేస్తే ఈ టోల్ ఫ్రీ కు కాల్ చేయండి.
దిశ, ఏపీ బ్యూరో : పద్మావతి మహిళా యూనివర్సిటీని దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తామని రాష్ట్ర విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ హామీ ఇచ్చారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తున్నట్లు వెల్లడించారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలలు తెరిచామని.. తల్లిదండ్రులు కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పిల్లల్ని పాఠశాలలకు పంపాలని సూచించారు.
పిల్లల హాజరు శాతం పెరుగుతుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కరోనా పరీక్షలు పెంచాలని అధికారులకు..కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అధిక ఫీజులు వసూలును కట్టడి చేస్తూ.. కొత్త ఫీజులను నిర్ణయిస్తూ ఉత్తర్వులు విడుదల చేశామన్నారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని మంత్రి సూచించారు. జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ కమిటీ పనిచేస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.