- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాప్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌గా వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నూతన శాప్ చైర్మన్‌కు వైసీపీ నేతలు, క్రీడాప్రముఖులు అభినందనలు తెలిపారు. ఇకపోతే సిద్ధార్థ్‌రెడ్డి ప్రస్తుతం కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు నందికొట్కూరులో పర్యటించిన సీఎం జగన్ సిద్ధార్థ్‌రెడ్డి తన తమ్ముడు అని అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాధాన్యత ఉన్న పదవిని ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చినమాటకు కట్టుబడ్డ సీఎం వైఎస్ జగన్ సిద్ధార్థ్‌రెడ్డిని శాప్ చైర్మన్‌గా నియమించారు.
పీవీ సింధుకు అభినందనలు
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన పీవీ సింధుకు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి అభినందనలు తెలిపారు. ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభకనబరిచారని కొనియాడారు. రెండు సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొని పతకాలు సాధించి దేశఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశారని బైరెడ్డి అన్నారు.