నవంబర్‌లో కశ్మీర్‌కు ముహూర్తం

by Anukaran |
నవంబర్‌లో కశ్మీర్‌కు ముహూర్తం
X

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఖాళీగా ఉన్న సుమారు 13వేల పంచ్, సర్పంచ్‌ సీట్లకు నవంబర్‌లో ఉపఎన్నికలు జరగనున్నాయి. తొమ్మిది దశలలో ఈ ఉపఎన్నికలు ఉండనున్నాయి. బై ఎలక్షన్ నిర్వహించడానికి జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

ఈ ఎన్నికలకు 10వ తేదీలోపు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశమున్నది. 2018లో 39,521 సర్పంచ్, పంచ్ సీట్లకు ఎన్నికలు జరిగాయి. ఇందులో రాజీనామాలు, తొలగింపులు, ఎన్నికల కాలంలో అభ్యర్థులులేకపోవడం వంటి కారణాల రీత్యా ప్రస్తుతం 13,257 సీట్లు ఖాళీలుగా ఉన్నాయి. ఇందులో 1,089 ఖాళీలు సర్పంచ్‌లకు సంబంధించినవి. కరోనా, భద్రత కారణాల దృష్ట్యా బైపోలింగ్ షెడ్యూల్‌నూ గతంలో వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed