చిన్నారుల కోసం టాయ్‌షాప్‌నే కొన్నారు

by Shyam |
చిన్నారుల కోసం టాయ్‌షాప్‌నే కొన్నారు
X

దిశ, వెబ్‌డెస్క్: యూకేలో కొత్తరకం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో పలు దేశాలు మరోసారి లాక్‌డౌన్ విధించగా..మరికొన్ని దేశాలు క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాయి. బ్రిటన్‌లో ప్రధానంగా లండన్, సౌత్ఈస్ట్ ఇంగ్లాండ్‌లో రూల్స్ స్ట్రిక్ట్‌గా అమలు చేస్తుండటంతో, నాన్ ఎసెన్షయల్స్ షాప్స్ అన్నీ మూతపడ్డాయి. బంధువులు, ఆత్మీయులు ఒకేచోట కలిసి పండుగ జరుపుకోవడానికి వీల్లేకుండా పోయింది. దీంతో క్రిస్మస్ ఘనంగా నిర్వహించుకుందామనుకున్న వాళ్లంతా తీవ్ర నిరాశకు గురవుతున్నారు. చిన్నారులు తమకు ‘క్రిస్మస్ తాతా’ ఇచ్చే గిఫ్ట్‌లు రావని బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో పేద, మధ్యతరగతికి చెందిన చిన్నారులతో పాటు, క్రిస్మస్ కానుకల కోసం ఎదురుచూస్తున్న పిల్లల కోసం ఇంగ్లాండ్, సౌత్‌వేల్స్‌కు చెందిన ర్యాన్ పావెల్, తన బిజినెస్ పార్ట్‌నర్ పాల్ జోన్స్‌‌తో కలిసి ఓ టాయ్ షాప్‌నే కొన్నాడు. వారందరికీ బొమ్మలు అందించడానికి సిద్ధమయ్యారు. ‘క్రిస్మస్ తాత’లుగా మారిన ఆ ఇద్దరు పార్ట్‌నర్స్..క్రిస్మస్ బొమ్మలు కావాలనుకునే కుటుంబాలు తమను సంప్రదించాలంటూ ఫేస్‌బుక్ వేదికగా విన్నవించుకున్నారు. ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అయింది. వారు చేస్తున్న పనికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed