- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జొమాటోకు వరుస షాక్‌లు.. మరోసారి రూ.184 కోట్ల ట్యాక్స్ నోటీసు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ నుంచి పలు ట్యాక్స్ డిమాండ్ నోటీసులు అందుకున్న కంపెనీ తాజాగా ఢిల్లీలోని సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ నుంచి రూ.184.18 కోట్ల జీఎస్‌టీ నోటిసును అందుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని కంపెనీ సోమవారం అర్ధరాత్రి రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. 2014 నుండి జూన్ 2017 వరకు కంపెనీకి చెందిన విదేశీ అనుబంధ సంస్థలు, భారతదేశం వెలుపల ఉన్న శాఖలు, దాని కస్టమర్‌లకు చేసిన నిర్దిష్ట విక్రయాలపై సర్వీస్ ట్యాక్స్ చెల్లించని కారణంగా ఈ నోటీసును పంపించినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
వడ్డతో కలిపి సర్వీస్ ట్యాక్స్ కింద రూ.92 కోట్లు, అలాగే పెనాల్టీ రూ.92 కోట్లు మొత్తం కలిపి రూ.184 కోట్లు చెల్లించాలని నోటీసులో ఉంది. అయితే దీనిపై స్పందించిన జొమాటో ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి న్యాయపరంగా అప్పీల్ చేస్తామని, దీని వలన కంపెనీపై ఎలాంటి ఆర్థిక ప్రభావం ఉండదని తెలిపింది. రెండు రోజుల క్రితం కూడా జొమాటో కర్ణాటక ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.23 కోట్ల జీఎస్టీ నోటీసులు అందుకుంది.