Zomato Food Rescue: జొమాటో ఫుడ్ రెస్క్యూ.. దీని వల్ల ఉపయోగమేంటి ?

by Y.Nagarani |
Zomato Food Rescue: జొమాటో ఫుడ్ రెస్క్యూ.. దీని వల్ల ఉపయోగమేంటి ?
X

దిశ, వెబ్ డెస్క్: ఫుడ్ కోసం ఎక్కడెక్కడికో వెళ్లనవసరం లేకుండా.. మనం ఎక్కడుంటే అక్కడికి ఫుడ్ డెలివరీ చేస్తున్నాయి ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్స్. అయితే చాలా మంది ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత.. డెలివరీ లేట్ అవుతుందనో, అడ్రస్ తప్పుగా పెట్టారనో.. రకరకాల కారణాలతో క్యాన్సిల్ చేస్తుంటారు. జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశాక క్యాన్సిల్ చేస్తే.. నో రీఫండ్ పాలసీ అమల్లోకి తీసుకొచ్చాక కూడా నెలకు నాలుగు లక్షల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతున్నాయని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. ఫలితంగా ఫుడ్ వేస్ట్ అవుతుందని, ఇలాంటి వాటిని జొమాటో ప్రోత్సహించదని పేర్కొన్నారు. ఫుడ్ వేస్టేజిని తగ్గించేందుకే జొమాటో ఫుడ్ రెస్క్యూ అనే కొత్త ఫీచర్ ను తీసుకొస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఈ ఫీచర్ ద్వారా కస్టమర్లు తమ ఆర్డర్ ను రద్దు చేసిన నిమిషాల వ్యవధిలో.. సమీపంలో ఉన్న కస్టమర్లు ఆ ఫుడ్ ను మరింత డిస్కౌంట్ తో కొనుగోలు చేసే వీలుంటుందన్నారు.

జొమాటో ఫుడ్ రెస్క్యూ ఫీచర్ ఎలా పనిచేస్తుంది ?

కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత.. క్యాన్సిల్ చేస్తే.. డెలివరీ ఎగ్జిక్యూటివ్ కు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కస్టమర్లకు యాప్ లో పాప్ అప్ అవుతుంది. ఇది కొన్ని నిమిషాల వరకే ఉంటుంది. ఒరిజినల్ ధర కంటే తక్కువ ధరకు క్యాన్సిల్ అయిన ఫుడ్ ను విక్రయిస్తారు. ఆ మొత్తం అమౌంట్ రెస్టారెంట్ పార్ట్నర్ కే అందుతుంది. అయితే ఐస్ క్రీమ్స్, షేక్స్, స్మూతీస్.. కొద్దిసేపటికే మెల్ట్ అయ్యే, పాడయ్యే ఆహారాలు మాత్రం ఫుడ్ రెస్క్యూ లో ఉండవని దీపిందర్ క్లారిటీ ఇచ్చారు. డెలివరీ లొకేషన్ చేంజ్ అయినా.. పికప్ నుంచి డ్రాప్ ఆఫ్ వరకూ ఏజెంట్లు తగిన పరిహారాన్ని పొందుతారు. ఈ రకంగా కొంతమేర ఆహార వృథాను అరికట్టవచ్చని దీపిందర్ వివరించారు.

ఉదాహరణకు ఒక వెజ్ బర్గర్ ను ఆర్డర్ చేసిన కస్టమర్ క్యాన్సిల్ చేస్తే.. వెంటనే దానిని సేల్ కు పెడతారు. ఒరిజినల్ ప్రైస్ 322 రూపాయలుంటే.. దానిని 161 రూపాయలకే మరో కస్టమర్ కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్ లిమిటెడ్ టైం వరకే ఉంటుంది. 7 నిమిషాల్లోపు ఎవరూ కొనకపోతే.. ఆఫర్ ఎక్స్పైర్ అవుతుంది. అంతా బాగానే ఉంది కానీ.. ఆ క్యాన్సిల్ చేయబడిన ఆర్డర్ ను 7 నిమిషాల్లో ఎవరూ కొనకపోతే దానిని ఏం చేస్తారన్న దానిపై దీపిందర్ క్లారిటీ ఇవ్వలేదు.

ఫుడ్ వేస్టేజ్ ను కంట్రోల్ చేసేందుకు దీపిందర్ గోయల్ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. లక్షల టన్నుల ఆహారం వేస్ట్ అవుతున్న తరుణంలో ఇలాంటి వినూత్న ఆలోచన చేయడం సమాజానికి చాలా అవసరమని ఓ నెటిజన్ కొనియాడారు. ఇలా చేస్తే.. ప్రజలు పూర్తి ధర కలిగిన ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి బదులుగా డీల్‌ల కోసం వెతకడం ప్రారంభిస్తారు. ఇది ఎలా కార్యరూపం దాల్చుతుందో వేచి చూడాలి అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మరి జొమాటో ఫుడ్ రెస్క్యూ ఫీచర్ ఎంతమేర సక్సెస్ అవుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed