- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Wealth Tax: పదేళ్లలో ప్రపంచంలోని 1 శాతం మంది సంపాదన 42 ట్రిలియన్ డాలర్లు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్రపంచ జనాభాలో సగం మంది పేదవారు పోగుచేసిన సంపద కంటే ‘అత్యంత ధనికులు 'గా ఉన్నవారు పదుల రెట్లు సంపాదిస్తున్నారని తాజా ఆక్స్‌ఫామ్ నివేదికలో వెల్లడైంది. ఈ గణాంకాలు ప్రపంచంలో ఉన్న దారుణ ఆర్థిక అసమానతలను సూచిస్తున్నాయి. బ్రెజిల్‌లో జరిగిన జీ20 కూటమి సభ్య దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్‌ల సమావేశం సందర్భంగా ఆక్స్‌ఫామ్ నివేదికను తీసుకొచ్చింది. ఆక్స్‌ఫామ్ విడుదల నివేదిక ప్రకారం.. గడిచిన పదేళ్ల కాలంలో ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన తొలి 1 శాతం మంది 42 ట్రిలియన్ డాలర్లు(రూ. 3,518 లక్షల కోట్లు) సంపాదించారు. ఈ మొత్తం ప్రపంచంలోని 50 శాతం మంది పేదలు సంపాదించిన దానికంటే 36 రెట్లు ఎక్కువ. ఇంత సంపాదిస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లు తమ సంపదలో 0.5 శాతం కంటే తక్కువ పన్నులు కడుతున్నారు. అంతేకాకుండా ప్రపంచంలోని బిలియనీర్లలో దాదాపు 80 శాతం మంది ఈ జీ20 దేశాల్లోనే ఉండటం గమనార్హం. సంపదలో భారీ పెరుగుదల ఉన్నప్పటికీ సంపన్నులపై పన్నులు గణనీయంగా పడిపోయింది. దీనివల్ల మెజారిటీ జనాభా తక్కువ వనరులతో మనుగడ సాగించే స్థాయిలో తీవ్ర అసమానతలకు దారితీస్తోందని ఆక్స్‌ఫామ్ అభిప్రాయపడింది. సంపన్నుల్లో మొదటి 1 శాతం మందిలో ఒక్కొక్కరి సంపద దశాబ్దంలో సగటున 4 లక్షల డాలర్ల చొప్పున పెరగ్గా, పేదలు 335 డాలర్ల చొప్పున సంపాదిస్తున్నారు. జీ20 సదస్సులో అత్యంత సంపన్నులపై సంపద పన్ను విధించే అంశంపై చర్చించనున్నారు.