- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 వేల లోన్ పైగా 7 శాతం సబ్సిడీ
దిశ, వెబ్‌డెస్క్: దేశప్రజలను ఆర్థికంగా ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వం చాలా రకాల పథకాలను అందిస్తోంది. అయితే కరోనా కారణంగా నష్టపోయిన వీధి వ్యాపారులను కూడా ఆదుకోడానికి ఒక పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. దాని పేరు ‘PM SVaNidhi’ సులభంగా దీనిని ‘ప్రధానమంత్రి వీధి వ్యాపారుల ఆత్మ నిర్భర్ నిధి’ అని అంటారు. ఈ పథకాన్ని జూన్ 01, 2020లో ప్రారంభించారు. దీని చివరి తేదీ మార్చి, 2022తోనే ముగిసినప్పటికీ, 2024, డిసెంబర్ వరకు కేంద్రం పొడిగించింది. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు తక్కువ వడ్డీకే రూ.50 వేల వరకు రుణాలు అందిస్తారు.
పీఎం స్వనిధి పథకంతో ఎలాంటి పూచీకత్తు లేకుండానే బ్యాంకులు రూ.50 వేల వరకు రుణాలు మంజూరు చేస్తాయి. అయితే ఈ రుణాన్ని పలు దఫాలుగా అందిస్తాయి. మొదటిసారి రూ.10 వేలు ఇస్తారు. దానిని సరైన సమయంలో చెల్లించినట్లయితే రెండో విడతలో రూ. 20 వేలు, మూడో విడతలో రూ. 50 వేల వరకు లోన్ ఇస్తారు. ఈ అమౌంట్ లబ్దిదారుని అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. పైగా దీనిలో వడ్డీ మొత్తంపై 7 శాతం సబ్సిడీ కూడా ఉంటుంది. ఈ లోన్ పొందేందుకు లోకల్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు కలిగి ఉండాలి. కటాఫ్ తేదీ మార్చి 24, 2020. ఈ తేదీలోపు వీధి వ్యాపారులగా ఉన్నవారు మాత్రమే ఈ పథకాన్ని పొందడానికి అర్హులు.
Also Read...