LIC జీవన్ సరళ్ పాలసీతో రూ. 15 లక్షలకు పైగా ఆదాయం

by Harish |   ( Updated:2023-02-09 17:18:20.0  )
LIC జీవన్ సరళ్ పాలసీతో రూ. 15 లక్షలకు పైగా ఆదాయం
X

దిశ, వెబ్‌డెస్క్: బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వివిధ వర్గాల ప్రజల అవసరాలను తీర్చడానికి ఒక పొదుపు పాలసీని తీసుకొచ్చింది. దాని పేరు 'జీవన్ సరళ్'. ఈ ప్లాన్‌తో వినియోగదారులకు డెత్ బెనిఫిట్స్ సౌకర్యం కూడా లభిస్తుంది. పాలసీదారు మధ్యలో మరణిస్తే వారి కుటుంబానికి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తారు. LIC జీవన్ సరళ్ ప్లాన్ ప్రీమియం చెల్లింపులు పాలసీదారులు తమ సౌకర్యార్థం మూడు ఎంపికలు కలిగి ఉన్నారు. నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, ఏడాది ప్రాతిపదికన చెల్లింపులు చేయవచ్చు.

దీనిలో 30 ఏళ్ల వ్యక్తి రూ.10 లక్షల ప్రీమియం చెల్లింపుకు 15 సంవత్సరాలు ఎంచుకున్నట్లయితే మెచ్యూరిటీ మొత్తం రూ. 15.5 లక్షలు. ఇందులో బీమా మొత్తం రూ. 10 లక్షలు, బోనస్ రూ. 5.5 లక్షలు. దురదృష్టవశాత్తు మరణిస్తే, నామినీకి డెత్ బెనిఫిట్స్ రూ. 15.5 లక్షలు లభిస్తాయి. ముఖ్యంగా వయసు పైబడిన తర్వాత ఆర్థిక స్వాంతన కోసం వినియోగదారులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పాలసీకి సంబంధించిన పూర్తి వివరాల కోసం దగ్గరలోని LIC శాఖలో లేదా అధికారిక వెబ్‌సైట్‌ లేదా ఏజెంట్‌ను సంప్రదించగలరు.

Read more:

PAN Aadhaar Linking Check :మీ ఆధార్‌‌తో పాన్‌ లింక్ అయిందో లేదో మెసేజ్ ద్వారా ఈ విధంగా తెలుసుకోండి!

Advertisement

Next Story

Most Viewed