AI ఆధారిత ఆరోగ్య సంరక్షణకు IISC బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్‌తో జతకట్టిన విప్రో

by Harish |
AI ఆధారిత ఆరోగ్య సంరక్షణకు IISC బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్‌తో జతకట్టిన విప్రో
X

దిశ, బిజెనెస్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఇటీవల కాలంలో చాలా కంపెనీలు తమ పెట్టుబడులు పెంచుతున్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ సేవల సంస్థ విప్రో AI ఆధారిత ఆరోగ్య ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థ అయిన సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ (CBR)తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి కృత్రిమ మేధస్సు (AI), మెషిన్ లెర్నింగ్ (ML), పెద్ద డేటా అనలిటిక్స్ శక్తిని ఉపయోగించుకుని కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తారు. విప్రోకు చెందినటువంటి పరిశోధన, అభివృద్ధి (R&D) బృందం ఆరోగ్య సమస్యలను విశ్లేషించి వాటికి కావాల్సిన పరిష్కారాల కోసం AI-ఆధారిత వ్యక్తిగత సంరక్షణ ఇంజిన్‌ను రూపొందించి, అభివృద్ధి చేస్తుంది.

ఇది ప్రజల ఆరోగ్యకరమైన వృద్ధాప్యం, సానుకూల జీవనశైలి మార్పులు, మానసిక-సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించడంలో సహాయపడుతుంది, అలాగే AIని ఉపయోగించడం ద్వారా హృదయ సంబంధ వ్యాధులు, పరస్పర సంబంధం ఉన్న న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్‌ల ప్రమాదాన్ని తగ్గించడం, నిర్వహించడం పై దృష్టి సారిస్తోంది. విప్రో లిమిటెడ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ హెడ్ డాక్టర్ అజయ్ చందర్ మాట్లాడుతూ, ఈ భాగస్వామ్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దీర్ఘకాలిక ఆరోగ్య సవాళ్లకు వ్యక్తిగతీకరించిన సంరక్షణ మద్దతును అందించనున్నట్లు తెలిపారు.

Advertisement

Next Story