WhatsApp: భారీ సంఖ్యలో భారతీయ ఖాతాలను తొలగించిన వాట్సాప్..!

by Maddikunta Saikiran |
WhatsApp: భారీ సంఖ్యలో భారతీయ ఖాతాలను తొలగించిన వాట్సాప్..!
X

దిశ, వెబ్ డెస్క్: మెటా(Meta)కు చెందిన పాపులర్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం యాప్ వాట్సాప్(WhatsApp)ను మన దేశంలో 600 మిలియన్లకు పైగా ప్రజలు వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఇదే అదునుగా భావించి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో గత కొంత కాలంగా మనదేశంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో యూజర్లకు ప్రైవసీ ఇంప్రూవ్ చేయడంపై వాట్సాప్ ఎక్కువ ఫోకస్‌ పెట్టింది. ఫేక్‌ వార్తలు(Fake news), తప్పుడు సమాచారం(Misinformation) లాంటి వాటిని అరికట్టేందుకు వాట్సాప్ సిద్ధమైంది. ఈ మేరకు భారీ సంఖ్యలో భారతీయ ఖాతాలపై నిషేధం విధించింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఏకంగా 85 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్‌ చేశామని వాట్సాప్ తన నెలవారీ నివేదికలో పేర్కొంది. ఇందులో 16,58,000 అకౌంట్స్ పై ఎలాంటి ఫిర్యాదులు రాకపోయినా, భారత ఐటీ రూల్స్ 2021(Indian IT Rules 2021) ఉల్లంఘన, వాట్సాప్ ను మిస్ యూజ్ చేస్తున్న కారణంగానే ఈ చర్యలు తీసుకున్నామని వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. వాట్సాప్ ఆగస్టు లో 84.58 లక్షల ఖాతాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా 2021లో భారత ప్రభుత్వం కొత్త ఐటీ నిబంధనలు తీసుకొచ్చింది. ఈ రూల్స్ ప్రకారం 50 లక్షల కంటే ఎక్కువ యూజర్ బేస్ ఉన్న సోషల్ మీడియా యాప్(Social Media Apps)లు ప్రతి నెల వివరణాత్మక నివేదికలను పంచుకోవాలి. యూజర్ల నుంచి వచ్చిన కంప్లైంట్స్ పై విచారణ చేపట్టి, ఎలాంటి చర్యలు తీసుకున్నారో నివేదికలో వెల్లడించాలి. వాట్సాప్(WhatsApp)కు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల మంది యూజర్లున్నారు.

Advertisement

Next Story